అఘోరీ ఊహించని చిక్కుల్లో చిక్కుకుంది. మామునూరు పోలీస్ స్టేషన్లో అఘోరీపై కేసు నమోదైంది. 325 BNS 11(1)(A) PCCA సెక్షన్లలో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి కారణం.. నవంబర్ 19న అఘోరీ వరంగల్ నగర శివారులోని బెస్తం చెరువు స్మశాన వాటికలో రెండు రోజులపాటు విడిది చేసింది. అక్కడ అఘోరీ బహిరంగంగా కోడిని బలి ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం వరంగల్‌కు చెందిన కొంత మంది యువత అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.