భద్రకాళి అమ్మవారికి మహా హారతి

60చూసినవారు
ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం పురస్కరించుకొని భద్రకాళి అమ్మవారి ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించి మహా హారతి అందించారు. హారతి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శేష వస్త్రములు సమర్పించారు. ప్రతి శుక్రవారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్