శనివారం రోజున వర్ధన్నపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ ఎస్టి బాలుర వసతి గృహం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ వర్ధన్నపేట పట్టణం అధ్యక్షుడు ఇస్లావత్ కళ్యాణ్ విద్యార్థులతో మాట్లాడుతూ పట్టణంలో ఉన్నటువంటి ఎస్టీ బాలుర వసతి గృహం యొక్క సమస్యలను పరిష్కరించాలని అన్నారు.లేని యెడల పెద్ద ఎత్తున భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.