ప్రజలు తమ ఇంటితోపాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. స్వచ్ఛతాహి సేవలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కలను నాటారు. పర్వతగిరి గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొని, సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో దిగారు.