వరంగల్ జిల్లా రాయపర్తి కేంద్రంలో బ్యాంక్ దోపిడీ ఘటన పోలీసులకు సవాల్ గా మారింది. భారీ దొంగతనం జరిగి వారం రోజు లైనా ఎలాంటి ఆధారాలు లభించకపోవడం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. సీసీఎస్, క్రైం బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ అధికారులతో 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 15 మంది ఎస్సైలు, 10 మంది సీఐలు, ముగ్గురు ఏసీపీ, డీసీపీ, కానిస్టేబుల్స్ ఉన్నారు.