ప్రజాపాలన విజయోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఆదివారం వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు. ప్రజలు నియంతృత్వ పాలనకు చరమగీతం పలికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకుని డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తి కానున్న శుభ సందర్భంలో నవంబర్ 19 న హన్మకొండలో తలపెట్టిన ప్రజా పాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.