రేపటి నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగనుంది. దీంతో అందుకు తగినట్లుగానే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల్లో ఎవరి ఏ ఆపద వచ్చినా తక్షణమే వైద్యు సదుపాయం కల్పించాలనే ఉద్ధేశంతో జాతీయ విపత్తు నిర్వహణ దళం వాటర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరు అస్వస్థతకు గురైనా ప్రాథమిక చికిత్స అందించనున్నారు.