కాంగ్రెస్ అగ్రనేత గురువారం కేరళలోని వయనాడ్ కి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. వయనాడ్ విషాదం మా మనసుల్ని కలిచి వేసింది. బాధితులకు అండగా ఉండేందుకే ఇక్కడకి వచ్చాం. యావత్ దేశం వయనాడ్ వైపు చూస్తోంది. ఎంతో మంది ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. మా నాన్న చనిపోయినప్పుడు బాధపడ్డాను. మళ్ళీ ఇప్పుడు అంతే బాధ కలుగుతోందన్నారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదన్నారు.