* లిఫ్ట్ తలుపులు ఓపెన్ కాకముందే బలవంతంగా తెరవడానికి ప్రయత్నించకూడదు.
* ఫోన్ కాల్ మాట్లాడుతూ లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేయకూడదు. ఒక్కోసారి లిఫ్ట్ రాకముందు డోర్స్ అన్‌లాక్ అయిపోతాయి. దీంతో మీరు చూడకుండా ఉంటే కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది.
* మీ పిల్లలను ఎప్పుడూ లిఫ్ట్‌లో ఒంటరిగా వదలకూడదు. ఒకవేళ అవసరం ఉంటే ముందుగా లిఫ్ట్ ఉపయోగం గురించి వారికి తెలియజేయాలి.
* అగ్ని ప్రమాదం, భూకంపం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడినపుడు లిఫ్ట్ ఉపయోగించకూడదు.