ఉమ్మడి రాష్ట్రంలో ఇంధనశాఖ ముసాయిదా చట్టం రూపొందించింది. కానీ శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించకపోవడంతో చట్టరూపం దాల్చలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు రూపొందించారు. అదీ చట్టంగా మారలేదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, యూపీ, పశ్చిమ్బంగాల్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ప్రత్యేక చట్టాలున్నాయి. ఏపీలో ఈ నెల 11న ఈ చట్టాన్ని ఆమోదించారు.