రేపు మూసీ బాధితుల ఇంట్లోనే ఉంటాం: కిషన్ రెడ్డి

69చూసినవారు
రేపు మూసీ బాధితుల ఇంట్లోనే ఉంటాం: కిషన్ రెడ్డి
TG: సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 'మా పదవులు త్యాగం చేసేందుకు మేం రెడీ. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు శనివారం రాత్రి మూసీ బాధితుల ఇంట్లోనే ఉంటాం. అక్కడే నిద్రిస్తాం. కాంగ్రెస్ హామీలన్నీ నెరవేరిస్తే మేం 3 నెలలు అక్కడే ఉండేందుకు సిద్ధం. రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి వస్తాం. మూసీ ప్రక్షాళనకు మొదటి పార, మొదటి తట్ట మేమే ఎత్తుతాం' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్