వార ఫలాలు (10-04-2022 నుంచి 16-04-2022)

42814చూసినవారు
వార ఫలాలు (10-04-2022 నుంచి 16-04-2022)
మేషం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నలుగురికి సాయం చేస్తారు. ఉద్యోగులు అధికారుల అండదండలు పొందుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. భక్తి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, పనులపై మనసు నిలుపుతారు. పెట్టుబడులకు ప్రతిఫలాలను పొందుతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విద్యార్థులకు ఈ వారం కలిసి వస్తుంది.

వృషభం
దినచర్యలో మార్పుల వల్ల మేలు కలుగుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. అధికారుల సహకారం లభిస్తుంది. భూములు, వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు కలిసివస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అయితే, అనవసరమైన చర్చలు ముందుకు రావచ్చు. ఆత్మీయుల సహకారంతో శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఖర్చులు పెరిగినప్పటికీ, అందుకు తగ్గ ఆదాయమూ ఉంటుంది.

మిథునం
కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వృథా ఖర్చులు ఉంటాయి. అయితే రావలసిన డబ్బు సమయానికి చేతికి అందడంతో ఊరట లబిస్తుంది. ప్రయాణాల వల్ల కార్యసాఫల్యం ఉంటుంది. మానసికంగా స్థిరంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. భాగస్వాముల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. కొత్త వ్యాపారంపై మనసు నిలుపుతారు. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. వ్యవసాయదారులకు అనుకూల సమయం. భూలావాదేవీలు సజావుగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి.

కర్కాటకం
పాత బాకీలు వసూలు అవుతాయి. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. అనవసరమైన విషయాలపై మనసు నిలపకుండా పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులకు కష్టే ఫలి అన్న చందంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తుల విషయంలో పురోగతి ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలను చేపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి.

సింహం
శుభకార్యాలు చేస్తారు. ప్రారంభించిన పనులు అను కూలిస్తాయి. స్నేహితులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆఫీసులో అధికారుల అండదండలు లభిస్తాయి. అయితే తోటివారితో మనస్పర్ధలు ఉండవచ్చు. నలుగురిలో మంచిపేరును పొందుతారు. పెట్టుబడులకు అనుకూల సమయం. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు రాణిస్తారు. సాహితీవేత్తలకు, సంగీతకారులకు మంచి సమయం. గృహ నిర్మాణాది కార్యక్రమాలను చేపడతారు. విందులకు హాజరవుతారు. కోర్టు కేసులలో సత్ఫలితాలు ఉంటాయి.

కన్య
ఊహించని ఖర్చులతో ఇబ్బందులు ఎదురు కావచ్చు. స్నేహితులు, బంధువుల మూలంగా పనులు నెరవేరుతాయి. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయంలో అస్థిరత ఉండవచ్చు. ముందుచూపుతో పనులు నిర్వర్తిస్తారు. దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. అనవసర ఆలోచనలను పక్కనపెట్టి, కార్య నిర్వహణపై మనసు నిలపాలి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్థిరాస్తి వల్ల ఆదాయం కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. న్యాయసమస్యలను అధిగమిస్తారు.

తుల
ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది. అయితే అనుకోని ఖర్చుల వల్ల కొన్ని పనుల్లో జాప్యం జరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థులు చదువులో రాణించి, మంచి సంస్థలలో చేరతారు. అవసరానికి డబ్బు అందకపోవడం వల్ల కొత్త పనులు వాయిదా పడవచ్చు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల వల్ల అలసట ఏర్పడుతంది. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులపై మనసు నిలుపుతారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి.

వృశ్చికం
రుణబాధలు తొలగిపోతాయి. పనుల్లో జాప్యం. కొత్త వస్తువులు కొంటారు. అందరి సహకారం లభిస్తుంది. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. శుభ కార్యాలకు అనుకూలం. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అందరితో స్నేహంగా ఉంటారు. వివాదాలలోకి వెళ్లకుండా పనులను పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లోవారితో చర్చించి, సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

ధనుస్సు
ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేణా పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉత్సాహంగా ఉంటారు. రావలసిన సొమ్ము పాక్షికంగా అందుతుంది. అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. వివాదాల వల్ల కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. భూముల వ్యవహారంలో జాగ్రత్త అవసరం. కోర్టు కేసులు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటి ఉద్యోగులతో మన స్పర్ధలు రావచ్చు. సంయమనం అవసరం. అధికారులతో స్నేహంగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలం. పెద్దలతో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో మంచి అవగాహన ఏర్పడుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు వస్తాయి.

మకరం
శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, కార్య నిర్వహణపై మనసు నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉంటూ, సంయమనంతో పనులు నెరవేర్చుకుంటారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆదాయంలో అస్థిరత మూలంగా కొన్ని పనులలో జాప్యం జరగవచ్చు. విద్యార్థులకు అనుకూలం. పెద్దల సహకారం లభిస్తుంది. పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. విందులు, వినోదాలపై మనసు నిలుపుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేపడతారు. ఆత్మీయులతో కొన్ని పనులు నెరవేరినా, మనస్ఫర్ధలు రావచ్చు. జాగ్రత్త మంచిది.

కుంభం
ఉత్సాహంతో పనులు చేస్తారు. పనిభారంతో అలసట పెరుగుతుంది. ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. అనుకోని ఖర్చులు ముందుకొస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. భక్తి పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందించుకునే ఆలోచన చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ వాయిదా పడుతుంది. కొత్త పనులను ప్రారంభించడానికి ఆర్థిక వనరుల కొరత ఉంటుంది. ఓపికతో పనులు పూర్తి చేసుకోవడం అవసరం.

మీనం
గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. తొందరపాటు నిర్ణయాలతో పనులలో జాప్యం ఉండవచ్చు. భక్తి పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చదువులో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలలోకి వెళ్లకుండా సంయమనంతో పనులు పూర్తి చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు లాభ సాటిగా ఉంటాయి. విశ్వాసంతో పనులు చేస్తారు. శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరగవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్