టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే నష్టాలివే

5464చూసినవారు
టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే నష్టాలివే
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు తమ కూతుళ్లకు 18 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేస్తున్నారు. దీంతో చాలా మంది 16 ఏళ్లకే తల్లులవుతున్నారు. అయితే టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల చాలా నష్టాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల కాన్పు సమయంలో తల్లులు మృతిచెందే అవకాశం ఉంది. కడుపులోనే బిడ్డ చనిపోయే అవకాశం ఉంది. నెలలు నిండకముందే శిశువు జన్మించే అవకాశముంది. శిశువులు తక్కువ బరువుతో పుట్టడం, శిశువులకు శ్వాసలో ఇబ్బంది, తీవ్రస్థాయిలో రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది.

సంబంధిత పోస్ట్