కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే?

81చూసినవారు
కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పరోక్షంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 'రాజకీయాల్లో భాష ముఖ్యం. వేరేవాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్నది నిజం. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడకుండా స్వీయ నియంత్రణ అవసరం. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మాట్లాడేలా దత్తాత్రేయ చొరవ చూపాలి' అని పొన్నం వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్