బిగ్‌బాస్‌ టైటిల్‌ తో పాటు సన్నీ ఇంకా ఏమేం గెలుచుకున్నాడంటే?

35243చూసినవారు
బిగ్‌బాస్‌ టైటిల్‌ తో పాటు సన్నీ ఇంకా ఏమేం గెలుచుకున్నాడంటే?
బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. వీజే సన్నీ విన్నర్ గా నిలిచాడు. బిగ్‌బాస్‌ టైటిల్‌ ను ఎగరేసుకుపోయిన సన్నీ.. భారీ మొత్తాన్ని కూడా అందుకున్నాడు. ఇన్ని రోజుల పాటు బిగ్ బాస్ షోలో ఉన్న రెమ్యునరేషన్ తో పాటు టైటిల్ ను గెలుచుకున్నందుకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ కి సంబంధించిన చెక్కును నాగార్జున చేతుల మీదుగా సన్నీ అందుకున్నాడు. ఇక అంతేకాకుండా సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ తరఫున షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల ప్లాట్‌ను, టీవీఎస్‌ కంపెనీకి చెందిన బైక్‌ను దక్కించుకున్నాడు.