ఇంటర్నెట్, డిజిటల్ పరికరాలను అధికంగా వాడడం వల్ల డిమెన్షియా వ్యాధి వచ్చే ముప్పు పెరుగుతుంది. దీనినే 'డిజిటల్ డిమెన్షియా' అంటారు. డిమెన్షియాలో మెదడు పనితీరు క్షీణించి జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం తగ్గుతాయి. ఎందుకంటే పరికరాలు మానవ మెదడులో కుడి వైపు (ఏకాగ్రతతో సంబంధం కలిగిన) భాగాన్ని వదిలేసి, ఎడమ భాగాన్ని ప్రేరేపిస్తాయి. స్క్రీన్ టైంను పరిమితం చేయడం ఈ వ్యాధి నివారణకు దోహదపడుతుంది.