భవిష్యత్తులో తమ పిల్లలకు ఆర్థికపరమైన భద్రతను కల్పించాలని యోచించే తల్లిదండ్రులు, కుటుంబాలే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రస్తుత నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో భాగంగానే ఈ వాత్సల్య పథకాన్నీ కేంద్రం తీసుకొచ్చింది. ఎన్‌పీఎస్‌లోని ఇతర ప్లాన్ల తరహాలోనే ఇదీ ఉంటుంది. తమ చిన్నారుల రేపటి కోసం తల్లిదండ్రులు, వారి సంరక్షకులు ఖాతాలను తెరిచి, అందులో కొంత మొత్తాలను మదుపు చేసుకోవచ్చు.