TG: సెక్రటేరియట్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న KTR వ్యాఖ్యలపై
కాంగ్రెస్ మండిపడింది. రాజీవ్ గాంధీ వల్లే KCR రాజకీయాల్లోకి వచ్చారని VH అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేత విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించారు. KTR తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రాజీవ్ గాంధీ విగ్రహం జోలికొస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ KTRను హెచ్చరించారు.