DAO సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

85చూసినవారు
DAO సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే నెల 8 నుంచి 12వ తేదీ వరకు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొంది. అభ్యర్థులు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్