'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

66చూసినవారు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదలపై నిర్మాత దిల్ రాజ్ అప్డేట్ ఇచ్చారు. 'రాయన్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెర్రీ అభిమానులు గేమ్ ఛేంజర్ మూవీ గురించి అడగ్గా.. దిల్ రాజు స్పందించారు. 'క్రిస్మస్ పండుగకు కలుద్దాం' అని చెప్పారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 15న టీజర్ వచ్చే అవకాశముందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

సంబంధిత పోస్ట్