ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్న WHO

53చూసినవారు
ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్న WHO
బర్డ్‌ ఫ్లూ వైరస్‌ తో ఒక వ్యక్తి మరణించారని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వెంటనే ఈ ప్రకటనను వెనక్కు తీసుకుంది. మరణించిన వ్యక్తికి ఇతర అనారోగ్య కారణాలు ఉన్నాయని, హెచ్‌5ఎన్‌2కి ఆపాదించబడిన మరణం కాదు.. అని స్పష్టం చేసింది. మరణించిన వ్యక్తికి పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించామని, ఆ వ్యక్తికి దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు, రక్తపోటు సమస్యలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మరణం బహుళ-కారకాల కారణాలతో జరిగిందని డబ్ల్యుహెచ్‌ఒ ధ్రువీకరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్