SP బాలు ఏం చదువుకున్నారో తెలుసా?

85చూసినవారు
SP బాలు ఏం చదువుకున్నారో తెలుసా?
బాలు తన ప్రాథమిక విద్యను నగరిలో మేనమామ శ్రీనివాసరావు ఇంట పూర్తి చేసి, స్కూలు ఫైనల్‌ విద్యను శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో కొనసాగించారు. శ్రీకాళహస్తిలో పి.యు.సి పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్లిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవాడు. తర్వాత అనంతపురంలో ఇంజనీరింగులో సీటు వచ్చింది. కానీ ఆయనకు అక్కడి వాతావరణం నచ్చక తిరిగి వచ్చేశాడు. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరాడు.

సంబంధిత పోస్ట్