తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జనవరి 3న రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహిళా టీచర్స్ డే నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మహిళల విద్య కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన కృషిని గౌరవించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుగా తెలిపింది.