మానవాళి మనుగడకు మూలమైన సమస్త ప్రకృతిని కాపాడుకోవడానికి నడుం బిగించాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 2018లో జరిగిన సర్వసభ్య సమావేశం నిర్వహించింది. జులై 28ని ‘అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం’గా పాటించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. అయితే కొన్నేళ్లుగా అనేక దేశాల్లోని వివిధ సంస్థలు ఈ దిశలో కార్యక్రమాలు నిర్వహించాయి. ఐక్యరాజ్యసమితి నిర్ణయం తర్వాత ఈ రోజుకు అధికారిక గుర్తింపు లభించింది.