యాదాద్రి రాజపేట మండలం రఘునాథపురం
శివారులో మజ్జిగ యాదగిరి (50) అనే రైతు హత్య అదే గ్రామానికి చెందిన వడ్లకొండ నాగరాజు అనే వ్యక్తి కర్రతో దాడి చేసి చంపినట్లుగా సమాచారం. కర్రతో దాడి చేసి పారిపోయిన నాగరాజును పట్టుకొని పోలీసులు విచారిస్తున్నారు. కర్రతో దాడి చేయగా యాదగిరి (50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి యాదగిరిగుట్ట ఏ. సి. పి రమేష్ చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.