భువనగిరి: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
భూదాన్ పోచంపల్లి మండలం జగత్ పల్లిలో ఐకెపి కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ లింగం యాదవ్ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నోముల ఎల్లారెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు నోముల బస్వా రెడ్డి, డైరెక్టర్లు గ్రామ పెద్దలు రైతులు పాల్గొన్నారు.