నిమజ్జనానికి వెళ్లి యువకుడు మృతి
భూదాన్ పోచంపల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది. నిమజ్జనానికి వెళ్లి యువకుడు మృతి చెందాడు. జి బ్లాక్ పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ యాదవ్(27) వినాయకుడి నిమజ్జనానికి చెరువు వద్దకు వెళ్లారు. అప్పటివరకు స్నేహితులతో అనందంగా గడిపారు. ఒక్కసారిగా స్నేహితుడు మృతి చెందడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు