మనస్థాపంతో ఓ నిరుద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భూధన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం తంగేళ్ళ రాజశేఖర్ (29) ఆరేళ్ల క్రితం ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగం రాక, పెళ్లి కాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎవరు లేని సమయం చూసి రాజశేఖర్ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఇరుగుపొరుగు వారికి సమాచారం అందడంతో తలుపులు పగలగొట్టగా అప్పటికే మృతి చెందాడు.