పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులకు ఆదేశించారు. శనివారం బీబీనగర్ మండలం పడమటి సోమారం ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల యొక్క హాజరు రిజిస్టర్ను తనిఖీ చేసి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది సెలవులో వెళ్ళారని అడిగి తెలుసుకున్నారు.