ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఈ నెల 27న ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు.. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో గురజా ప్రకాశ్ రాజ్ అనే వ్యక్తి పేరుతో 42 ఓట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన పీడీఎఫ్ అభ్యర్థికి చెందిన మద్దతుదారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.