ప్రపంచ జ్ఞాపకశక్తి లీగ్ ఛాపింయన్‌షిప్‌లో పుదుచ్చేరికి చెందిన రాజ్ కుమార్ విజేతగా నిలిచాడు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పోటీల్లో కేవలం 13.50 సెకన్లలో 80 అంకెలను జ్ఞాపకం తెచ్చుకొని ఛాంపియన్‌గా అవతరించాడు. పోటీల్లో విజేతగా నిలువాలంటే యాదృచ్ఛికంగా తెరపై ప్రదర్శించిన 80 అంకెలను వీలైనంత త్వరగా గుర్తుకు తెచ్చుకొని వాటిని 100% కచ్చితత్వంతో రీకాల్ షీట్‌లో నమోదు చేయాలి. రాజ్‌కుమార్ ఈ లక్ష్యాన్ని రికార్డు వేగంతో పూర్తి చేయడంతో విజేతగా నిలిచాడు.