బస్వాపూర్ 16 ప్యాకేజీ 1.5 టీఎమ్ సీ సామర్థ్యంతో నిర్మించనున్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులను జూలై 31 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రెటరీ స్మితాసబర్వాల్ సూచించారు. బస్వాపూర్ రిజర్వాయర్ కట్ట నిర్మాణాలను ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రెటరీ, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ లతో కలిసి కట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి భూములు కోల్పోయిన వారికి 70 కోట్ల నష్టపరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ అగర్వాల్ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఏస్ఈ మరియు డిఈ తదితరులు పాల్గొన్నారు.