గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం

64చూసినవారు
భూధన్ పోచంపల్లి మండలంలోని జగత్ పల్లి, పెద్దగూడెం, గౌస్ కొండ గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయలను శనివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిందన్నారు. గ్రామపంచాయతీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. గత పాలనతో గ్రామపంచాయతీల అభివృద్ధి కుంటుపడిందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్