రెచ్చిపోయిన దొంగలు.. ట్రాక్టర్ చోరీ
యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం మగ్దుంపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన పాదం పాండు అనే రైతు వ్యవసాయ క్షేత్రం వద్ద నిలిపి ఉన్న ట్రాక్టర్ దున్నకాల వీల్స్ ను తొలగించి ట్రాక్టర్ ఎత్తుకెళ్లారు. బావి వద్దకు వెళ్లి చూడగా ట్రాక్టర్ కనిపించకపోవడంతో బాధిత రైతు 100కు డయల్ చేశారు.