బీబీనగర్: ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న గోలి పింగల్ రెడ్డి
బీబీనగర్ మండలంలోని పిల్లాయి పల్లి గ్రామం నుండి మక్తాఅనతరం గ్రామ మూసీ బ్రిడ్జి వరకు ప్రజా చైతన్య యాత్రను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూసి ప్రక్షాళనను పునర్మితంగా చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గోలి పింగల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.