మోత్కూరు: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ దిష్టి బొమ్మ దగ్ధం
యాదాద్రి జిల్లా మోత్కూరులో గురువారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై తుంగతుర్తి గాదరి కిషోర్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. కిషోర్ తన స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడాలని, కోమటి రెడ్డి కాలి గోటికి కూడా సరిపోని గాదరీ కిషోర్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై పదవి లేకపోవడంతో మతిస్థిమితం తప్పిందన్నారు.