నకిలీ అల్లం పేస్ట్, కారం, పసుపు తయారీ కేంద్రంపై దాడి
మోత్కూర్ మునిసిపల్ కేంద్రంలోని పద్మశాలి కాలనీకి చెందిన దుడుక సోమరాజు ఎలాంటి అనుమతులు లేకుండా సింథటిక్ కలర్స్ తో అల్లం పేస్ట్, పసుపు, కారం తయారు చేస్తున్నారన్న సమాచారంతో శుక్రవారం ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. అతని వద్ద నుండి 125 సింథటిక్ కలర్స్ డబ్బాలు, 263 అల్లం పేస్ట్ డబ్బాలు, 50 కిలోల పసుపు, 5 కిలోల కారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.