ఉమ్మడి నల్గొండ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల సందడి
ఉమ్మడి నల్గొండలో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటరు జాబితా పనిలో నిమగ్నమయ్యారు. పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా మేనిఫెస్టో విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురంలో కొడారి లతమల్లేశ్ ముందుస్తు సర్పంచ్ ఎలక్షన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. గ్రామస్తులకు ఉచిత మంచినీటిని, ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.