సంగ్య తండాలో మద్యం నిషేధం

54చూసినవారు
తుర్కపల్లి మండలం సంగ్యతండా గ్రామ ప్రజలు మద్యం నిషేధిస్తూ తీర్మానం చేసుకున్నారు. నేటి నుండి గ్రామంలో ఎవరు మద్యం అమ్మకం, కొనుగోలు చేయవద్దని సూచించారు. మద్యానికి బానిసలై ఆర్థికంగా, విద్య పరంగా, కుటుంబ పెద్ద దిక్కును పోగొట్టుకొని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తండా ప్రజలు తెలిపారు. మండల పోలీస్ వారి సహకారంతో తండా యువకుల సమక్షంలో మద్యం నిషేధిస్తూ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్