విశాఖ: మాన‌సిక ఆరోగ్యంపై రంగుల ప్ర‌భావం

రకరకాల రంగుల రంగోలీలు మనిషి మనస్సుపై, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని విశాఖ గీతం వర్సిటీ ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై. గౌతంరావు అన్నారు. శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా గీతం వర్సిటీలో నిర్వహించిన రంగుల రంగోలీలో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యం ఎంత అవసరమో వివిధ రకాల రంగులతో తీర్చిదిద్దిన రంగవల్లికల ద్వారా విద్యార్ధులు వినూత్నరీతిలో తెలియజెప్పారు.

సంబంధిత పోస్ట్