విశాఖ: ఎక్సైజ్ ల్యాబరేటరీని పరిశీలించిన మంత్రి

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఉన్న రీజినల్ ఎక్సైజ్ ల్యాబరేటరీని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విశాఖ ఎంపీ శ్రీ భరత్ సోమవారం పరిశీలించారు. అక్కడ జరిగే పరీక్షల విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మద్యం నాణ్యతను పరిశీలించే పరికరం పనితీరును వారు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో ఏయూ అధికారులతో పాటు కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్