భారత తొలి ఏకైక మహిళ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి అని కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శతక బుల్లిబాబు అన్నారు. మంగళవారం స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పాడేరులోని ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేసారని కొనియాడారు. నాయకులు కృష్ణారావు తదితరులున్నారు.