విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లా చదివే విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి బెదిరించారు. ఈ మేరకు బాధితురాలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి వివరాల ప్రకారం.. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. బాధితురాలికి నిందితులలో ఒకరితో 2 నెలల నుంచి పరిచయం ఉందని తెలిపారు. విచారణ జరుగుతుందని అన్నారు.