విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశం 2024 ను డిసెంబర్ 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలుమ్నీ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ ఇ. కంకర్రావు తెలిపారు. మంగళవారం ఏయు ఆలుమ్నీ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సంవత్సరం ఆలుమ్నీ సమావేశానికి ముఖ్యఅతిధిగా ఎల్ అండ్ టి గ్రూప్ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు.