కురుస్తున్న భారీ వర్షాలకు దేవరాపల్లి మండలంలో రైవాడ రిజర్వాయర్ లో నీటి నిల్వలు పెరుగుతున్నడంతో సోమవారం సాయంత్రం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జలశయాన్ని సందర్శించి పరిశీలించారు. జలాశయంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాద స్థాయికి చేరువులో నీటిమట్టం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు.