పెదకూరపాడు: యువకులపై పెట్టిన కేసులు రద్దు చేయాలి

పెదకూరపాడు మండలం లగడపాడు దళిత యువకులపై అదే గ్రామానికి చెందిన రావెల బుచ్చయ్య చౌదరి, మనేష్ లు సెప్టెంబర్ 12న పెదకూరపాడు పోలీసు స్టేషన్ లో పెట్టిన తప్పుడు కేసును రద్దు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తూ సోమవారం కుల నిర్మూలనా పోరాట సమితి ఆధ్వర్యంలో పెదకూరపాడు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులతో కలసి ధర్నా నిర్వహించారు. అనంతరం సంబంధిత మెమోరాండం తాసిల్దారుకు అందజేశారు.

సంబంధిత పోస్ట్