ప్రత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించిన కలెక్టర్

గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలం ముట్లూరు, అనంతవరప్పాడు, కోవెలమూడి గ్రామాలలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం పర్యటించారు. గ్రామాల్లో త్రాగునీరు, పారిశుధ్యం కార్యక్రమాలతో పాటు అంగన్వాడి కేంద్రాలను పరిశీలించారు. ప్రతి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. చేపట్టవలసిన కార్యక్రమాలను అధికారులకు వివరించారు.

సంబంధిత పోస్ట్