ప్రతిపాడు: కాకుమాను పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఎస్పి

గుంటూరు సౌత్ సబ్ డివిజనల్ డి. ఎస్. పి పి మల్లికార్జునరావు గురువారం కాకుమాను పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు.స్టేషన్ లో రికార్డులు తనిఖీ చేసి పెండింగ్ కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కాకుమాను, పెదనందిపాడు మహిళా పోలీసులకు పలు సూచనలు ఇచ్చారు. ప్రత్తిపాడు సిఐ సి శ్రీనివాసరావు, కాకుమాను ఎస్ఐ పృథ్వి ఏకనాథ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్