ముఖ్యమంత్రి చంద్రబాబు తుళ్ళూరు మండలం తాళ్లాయపాలెంలో గురువారం పర్యటించనున్నారు. సంబంధించిన వివరాలను గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. తొలుత సిఆర్డిఏ పరిధిలో నిర్మించిన జీఐఎస్ సబ్ స్టేషన్ ప్రారంభిస్తారని చెప్పారు. దీంతో పాటు రాష్ట్రంలో మరో 15 సబ్ స్టేషన్లు వర్చువల్గా శంకుస్థాపన చేసి, 5 సబ్ స్టేషన్లు కూడా వర్చువల్గా సీఎం ఇక్కడి నుంచే ప్రారంభిస్తారని అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.