ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను జయప్రదం చేయాలని జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి సూచించారు. జిల్లా అధికారులతో సోమవారం కలెక్టరేట్లో ఆయన సమావేశమయ్యారు. బాపట్ల జడ్పీపాఠశాలలో జరిగే విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్ 7న హాజరుకానున్నారని చెప్పారు. అధికారిక సమాచారం వచ్చినందున అధికారులంతా అప్రమత్తం కావాలన్నారు. ఎమ్మెల్యే వేగేశన, కమిషనర్ పాల్గొన్నారు.